Close

నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ‘నక్ష’ (NAKSHA) కార్యక్రమంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మరియు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధిత రాష్ట్రాల భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్లు,

Publish Date : 29/07/2026

ఏలూరు, జూలై , 29 : నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ‘నక్ష’ (NAKSHA) కార్యక్రమంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మరియు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధిత రాష్ట్రాల భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్లు, జిల్లాల కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ‘నక్ష’ (NAKSHA) కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని భూములు, ఇళ్లను డ్రోన్లు, ఆధునిక సాంకేతికతతో డిజిటల్ రికార్డు చేసే ఒక ముఖ్యమైన సర్వే ప్రాజెక్ట్. దీని ద్వారా ప్రతి ఆస్తికి క్యూఆర్ కోడ్ (QR Code) మరియు ప్రత్యేక నంబర్‌తో కూడిన ప్రొపర్టీ కార్డును అందజేస్తారు. ఇది ‘డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం’ (DILRMP) – భూ వనరుల విభాగం (DoLR) పరిధిలోని ఒక పైలట్ కార్యక్రమం మరియు దేశవ్యాప్తంగా 152కు పైగా పట్టణ స్థానిక సంస్థలలో (ULBs) ఇది అమలు చేయబడుతోంది . ఆంధ్రప్రదేశ్ లోని 10 పట్టణ ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలుకు ఎంపిక చేయగా ఏలూరు నగరం అందులో ఒకటిగా నిలిచింది.

జూమ్ కాన్ఫరెన్స్ లో ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొన్నారు.