సేంద్రియ విధానంలో సాగుచేసిన ఉత్పత్తులకు బ్రాండింగు ఇమేజీతో పాటు మార్కెటింగు సౌకర్యం కల్పించాలి.
https://companies.apedb.in/company-login పోర్టల్ ను జిల్లాలో పారిశ్రామికవేత్తలు సమస్యలు, కావలసిన అవసరాలను నేరుగా ప్రభుత్వానికి తెలియజెయ్యవచ్చును, సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష …
ఏలూరు, జూలై 29: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశమందిరంలో బుధవారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, సంబంధిత శాఖలు అధికారులతో కలసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జిల్లాలో పరిశ్రమలు ప్రగతిని, గత మాసం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుపై ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. https://companies.apedb.in/company-login పోర్టల్ ను జిల్లాలో పారిశ్రామికవేత్తలు సమస్యలు, కావలసిన అవసరాలను నేరుగా ప్రభుత్వానికి తెలియ జెయ్యవచ్చునని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు సూచించారు.
@ డిటైల్ ప్రాజెక్టు రిపోర్టులు పవర్ పాయింటు ప్రజెంటేషన్ ద్వారా విజయవాడ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ – పర్వేజ్ మొహమ్మద్ వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, అన్నిరకాలు ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించుటకు ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. గిరిజన తండాల్లో యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని అన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు రెండవవిడతగా టార్గెట్ 130 కాగా, ఇప్పటివరకు 45 యూనిట్లను గుర్తించడం జరిగిందని, 11 మంజూరు కాగా, వివిధ బ్యాంకుల్లో 20 పెండింగులో ఉన్నాయని, ఆగస్టు 15వ తేదీ నాటికి బ్యాంకుల్లో ఉన్న ధరఖాస్తులు మంజూరు చేయించి పనులు మొదలు పెట్టించాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కులు చింతలపూడి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఉత్సాహవంతులైన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని అన్నారు. ఉంగుటూరు, దెందులూరు, నూజివీడు నియోజకవర్గాలలో స్థలసేకరణ పూర్తయిందని, మిగతా ప్రక్రియను వేగవంతం చెయ్యాలని అన్నారు. సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, అవసరాన్ని బట్టి ఒక్క రోజులోనే అనుమతులు మంజూరు చేసి, ప్రతి యూనిట్ ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఋణాలు మంజూరులో ప్రత్యేక దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రుణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వారంగాలలో నూతన వరవడులు గుర్తించి ప్రైవేటు పెట్టుబడులు దారులను మరింత ఆకర్షించేలా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. రాంపు ప్రోగ్రాం నందు ఇచ్చిన టార్గెట్స్ సెప్టెంబరు లోగా పూర్తిచెయ్యాలని, అలాగే వేండొర్ డెవలప్మెంటు ప్రోగ్రాం వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు ఉపయోగం ఉంటె వారితో కలిసి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని రాంపు నోడల్ అధికారి యన్.జితేంద్రబాబును జిల్లా కలెక్టరు ఆదేశించారు. విజయవంతమైన పథకాలను సక్సెస్ స్టోరీలుగా పబ్లిష్ చేయించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకటరావు, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, నగర పాలకసంస్థ కమీషనరు ఏ.భానుప్రతాప్, పొల్యూషన్ కంట్రోల్ ఇఇ ఏ.శ్రీరామచంద్ర మూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జెడి వై.విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా.యు.శోభ, డ్రామా పిడి కె.వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, డిఆర్డిఏ పిడి టి.వి.విజయ లక్ష్మి, జిల్లాపంచాయతీశాఖ అధికారి జి.మల్లిఖార్జున రావు, సిపివో బి.శ్రీదేవి, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్.జితేంద్ర బాబు, జిల్లా గ్రౌండు వాటరు డిడి పైలా కోదండరామ్, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.