Close

పిజిఆర్ఎస్ అర్జీలు పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు

Publish Date : 27/07/2026

ఏలూరు, జూలై 27: పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటునని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. స్థానిక జిల్లా కలెక్టరేటు నుండి సోమవారం పిజిఆర్ఎస్ ధరఖాస్తులు పరిష్కారంలో అధికారులతో జిల్లా కలెక్టరు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాఖలు వారీగా పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీలు పరిష్కార ప్రగతిలో లోటు కనిపించిన అధికారులు పట్ల జిల్లా కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అర్జీదారుని కలిసి వారి సమస్యను స్వయంగా తెలుసుకుని, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని మరలా సోమవారం నాటికి పరిష్కారంలో ప్రగతిని సాధించాలని, లేకపోతే శాఖా పరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు హెచ్చరించారు. పిజిఆర్ఎస్ ధరఖాస్తులు పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దన్నారు. కొంతమంది అధికారులు కింద స్థాయి సిబ్బంది అర్జీదారుని దగ్గరకు పంపిస్తున్నారని, కొందరు నాపరిధి లోనిది కాదని సమాధానం చెబుతున్నారని ఇది క్షమించరాని నేరమని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారుని వద్దకు వెళ్ళి వారితో ఫ్రెండ్లీగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సానుకూల దృక్పధంతో నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని అన్నారు. పిజిఆర్ఎస్ ధరఖాస్తులు పరిష్కారంలో అర్జీదారులు నుండి ఒక్కఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులుపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

జూమ్ కాన్ఫరెన్సలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, కె.లక్ష్మీప్రసన్న, యం.వి.రమణ, వివిధ శాఖలు జిల్లా, డివిజన్, మండల అధికారులు వారివారి కార్యాలయాలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.