Close

జిల్లాలో ప్రత్యేక కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం నాణ్యమైన బియ్యం ప్రత్యేక

Publish Date : 30/07/2026

ఏలూరు, జులై, 30 : జిల్లాలో ప్రత్యేక కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం నాణ్యమైన బియ్యం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుపై జేసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ఆగష్టు 1వ తేదీ నుండి ప్రత్యేక కేంద్రాలద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, నాణ్యమైన BPT స్టీమ్ బియ్యం మరియు BPT రా (Raw) బియ్యంను ఏలూరులోని పతేబాద, వన్ టౌన్ రైతు బజార్లు, కైకలూరు రైతు బజారు, నూజివీడు రైతు బజారు మరియు 3 ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. సూపర్ ఫైన్ బియ్యం కిలోకు 52 రూపాయలు చొప్పున, బిపిటి స్టీమ్ బియ్యం కిలోకు 52 రూపాయలు, బిపిటి రా రైస్ కిలోకు 50 రూపాయలు చొప్పున విక్రయించాలన్నారు. బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు అందించాలని, బియ్యం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుడు తమ ఆధార్ నెంబర్ను తప్పునిసరిగా తెలియజేయాలని, కార్డుకు గరిష్టంగా 26 కిలోల బియ్యం మాత్రమే అందించడం జరుగుతుందన్నారు. ధరల పెరుగుదల పేద కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.