Close

జిల్లాలో గత 45 రోజులలో 22ఏ జాబితా నుండి తొలగింపునకు 461అర్జీలు అందగా 180 అర్జీలు పరిష్కరించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కి చెప్పారు.

Publish Date : 01/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 1 : జిల్లాలో గత 45 రోజులలో 22ఏ జాబితా నుండి తొలగింపునకు 461అర్జీలు అందగా 180 అర్జీలు పరిష్కరించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కి చెప్పారు. 22ఏ భూ సమస్యల పరిష్కారం,రీసర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవిన్యూ వన్, పిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి తో కలిసి సిఎస్ సాయిప్రసాద్ రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. అర్జీదారులు ఇంటికి వెళ్లి సమస్యను పూర్తిగా తెలుసుకుని నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. 22ఏ జాబితా నుండి తొలగింపునకు అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలమేరకు ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను కారణాలను అర్జీదారులకు తెలియజేస్తూ తిప్పిపంపాలన్నారు.

ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జులై, 15వ తేదీ నుండి ఆగష్టు, 31వ తేదీ వరకు 22ఏ జాబితా నుండి తొలగింపునకు 461అర్జీలు అందగా 180 అర్జీలు పరిష్కరించామని, నిబంధనల మేరకు లేని 183 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. పెండింగ్ లో 98 అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కారమన్నారు. ఆగష్టు నెలలో 26 గ్రామాలలో 13 వేల 668 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ లక్ష్యానికి గాను నూరు శాతం పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని నూరుశాతం పూర్తిచేశామన్నారు. . రైతుల ఈకెవైసి పూర్తిచేసి, రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్, తదితర వివరాలను పరిశీలించి తప్పులు లేకుండా తదుపరి నెలలో పంపిణీ చేయవలసిన పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలియజేసారు. .

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ ఎం. . శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.