Close

పిజిఆర్ఎస్ అర్జీదారులను పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలి

Publish Date : 01/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 1: పిజిఆర్ఎస్ అర్జీదారులను పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR), కౌశలం, తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి అధికారి అర్జీదారుని ఇంటికి వెళ్లి సమస్యను గురించి సవివరంగా తెలుసుకోవాలన్నారు. పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు అర్జీదారుల వద్దకు వెళ్లి అర్జీ అందినట్టు రసీదు అందించి, సక్రమ విచారణ చేయాలన్నారు. అర్జీదారుడిని కలిసినట్టు ఫోటో ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. కానీ కొందరు అధికారులు అర్జీదారులను కలవకుండా తమవద్దకు పిలిపించుకుంటున్నారని, అర్జీలను సక్రమంగా విచారణ చేయకుండా పరిష్కారం చూపుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. పిజిఆర్ఎస్ అర్జీలు సానుకూల పరిష్కారం అయిన లబ్ధిదారులతో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో అర్జీల పరిష్కారం పై సానుకూల అభిప్రాయం తెలియజేసేలా అర్జిదారులకు అవగాహన కలిగించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంనకు ప్రజలు అందించిన పిజిఆర్ఎస్ అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. కౌశలం కాయక్రమంలో జిల్లాలోని 2303 మంది యువతకు శిక్షణ అందించి ఉద్యోగాలు అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకున్నామని, శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, డిఆర్ఓ ఎం శ్రీదేవి, ఎస్డిసి దేవకీదేవి, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి నాయుడు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బిఎల్ఓ లు, వివిధ శాఖల అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.