పేదలు సేవలో ఎన్టీఆర్ బరోసా సామాజిక పింఛన్లను స్థానిక ఆదివారపుపేట, రజకులపేట స్వర్ణవార్డు సచివాలయం వద్ద లబ్ధిదారులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నగదును పంపిణీ చేశారు ..
ఏలూరు, సెప్టెంబరు 01: స్థానిక ఆదివారపుపేట లైను, రజకులపేట
స్వర్ణవార్డు సచివాలయం వద్ద పేదలు సేవలో ఎన్టీఆర్ బరోసా సామాజిక పింఛన్లను మంగళవారం ఇంటింటికి వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తూ, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకుని పింఛన్లు నగదును స్వయంగా లబ్ధిదారులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అందజేశారు. లబ్ధిదారులతో మమేకమై వారి ఆరోగ్యపరిస్థితులు, జీవనవిధానం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ యన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు సొమ్మును పొదుపుగా వాడుకుని రేపటికోసం కొంత పొదుపు చేసుకోవాలని అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం, నడక వంటి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ నెలలో 2,53,845 మంది ఫించన్లు దారులకు 111.60 కోట్ల రూపాయిలు పంపిణీ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఫించన్లు పంపిణీ 1వ తేదీన నూరుశాతం పంపిణీ చేయుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అనివార్య కారణాలు చేత 01 వ తేదీన తీసుకోని వారికి 02వ తేదీన పంపిణీ చెయ్యడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో 4932 మంది స్వర్ణగ్రామ, స్వర్ణగ్రామ సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందితో పింఛన్లు సొమ్మును ఇంటింటికి వెళ్ళి పంపిణీకి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఫించన్లు పంపిణీ ఈ రోజు నూరుశాతం పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్న, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మీ, నగర పాలక సంస్థ అదనపు కమీషనరు డి.శ్రీనివాస రావు, తహశీల్దారు యస్.వి. రవీంద్రనాథ్, ఏవో మహాలక్ష్మి, నగరపాలక సంస్థ, రెవిన్యూ, స్వర్ణవార్డు ఉద్యోగులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.