సెప్టెంబర్ ,1వ తేదీన 2,53,845 మంది ఫించన్ దారులకు 111.60 కోట్ల రూపాయిలు పంపిణీ-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, ఆగష్టు, 31 : ఏలూరు జిల్లాలో సెప్టెంబర్, 1వ తేదీన 2,53,845 మంది ఫించన్ దారులకు 111.60 కోట్ల రూపాయిలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసాపించను పధకము సెప్టెంబర్ నెల పింఛను చెల్లింపులు సెప్టెంబర్ , 1వ తేదీ ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఏలూరు జిల్లా లో సెప్టెంబర్ , 2026 నెలలో 2,53,845 మంది ఫించన్ దారులకు 111.60 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా లో ఫించన్ లు పంపిణీ 1 వ తేదీన 100 శాతం పంపిణీ చేయుటకు చర్యలు తీసుకొనటం జరిగిందని, అనివార్య కారణం ల చేత 1 వ తేదీన తీసుకోని వారికి 2వ తేదీ న పంపిణీ చేయబడుతుందన్నారు. జిల్లా లో 4932 మంధి సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది తో ఫించనల పంపిణీకి ఏర్పాటులు చేయడమైనదన్నారు. పింఛను పొందేందుకు పింఛను దారులు వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం అందించాలని, సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం 7.00 గంటల నుండి పించను పంపిణి జరిగే విధముగా చర్యలు తీసుకోవలసిందిగా డిఆర్డిఏ పీడీ ని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.