Close

ఏలూరు జిల్లాలో శాశ్వత ఎన్‌డీపీఎస్ కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్ ప్రారంభం

Publish Date : 09/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 9 : హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా పరిధిలో ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాలను భద్రపరిచేందుకు నూతనంగా నిర్మించిన శాశ్వత ఎన్‌డీపీఎస్ కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్‌ను బుధవారం ఎస్పీ శ్రీ ప్రతాప్ శివ కిశోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, శాశ్వత ఎన్‌డీపీఎస్ కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్ ఏర్పాటు ద్వారా జిల్లాలోని ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించిన స్వాధీనం చేసిన పదార్థాల భద్రత, పర్యవేక్షణ మరియు నిర్వహణ మరింత క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ శాశ్వత కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్‌ను జిల్లా పోలీసు కార్యాలయం (DPO), ఏలూరు సమీపంలోని ఏఆర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలు మరియు ఇతర కాంట్రాబాండ్‌ను పోలీసు స్టేషన్ వారీగా క్రమబద్ధంగా భద్రపరచడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో, దివ్యాంగుల సంక్షేమ కార్యాలయానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్‌లో భద్రపరిచిన గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాలను, నూతన శాశ్వత స్టోరేజ్ రూమ్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, నిర్ణీత విధి విధానాలను అనుసరించి సురక్షితంగా నూతన భద్రపరిచే గదికి తరలించడం జరుగుతుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన శాశ్వత కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్‌లో స్వాధీనం చేసిన పదార్థాల భద్రతకు అవసరమైన ప్రవేశ నియంత్రణ, పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు మరియు క్రమబద్ధమైన భద్రపరిచే విధానాలను ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా ఎన్‌డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసిన మాదకద్రవ్యాలు మరియు ఇతర నిషేధిత పదార్థాల భద్రత, పర్యవేక్షణ, నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు వీలు కలుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ, EAGLE విభాగం, నషా ముక్త్ భారత్ అభియాన్ బృందం, రోడ్లు మరియు భవనాల శాఖ (R&B), అలాగే ఇతర సంబంధిత జిల్లా స్థాయి శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.