ఈనెల 16వ తేదీ వరకు నూతన పెన్షన్ల నమోదు ప్రక్రియ-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
Publish Date : 07/09/2026
ఏలూరు, సెప్టెంబర్, 7 : ఏలూరు జిల్లాలో ‘ఎన్టీఆర్ భరోసా’ (NTR Bharosa) నూతన పింఛన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు లలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా పింఛను కోసం నమోదు (Registration) చేసుకోవాలనుకునే అర్హులైన ప్రజలు తమ సమీప స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులలో డిజిటల్ అసిస్టెంట్లు (Digital Assistants) లేదా వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులను (Ward Education & Data Processing Secretaries) నేరుగా సంప్రదించి ఆధార్ కార్డు తో పాటు గా అవసరమైన ఇతర అర్హత/ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కల్లెకర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.