జిల్లాలో ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై ఈనెల 5, 6 తేదీలలో ప్రత్యేక దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
Publish Date : 03/09/2026
ఏలూరు, సెప్టెంబర్, 3 : జిల్లాలో ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై ఈనెల 5, 6 తేదీలలో ప్రత్యేక దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగిస్తూ ఆదేశాల జారీ చేసిన దృష్ట్యా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఈనెల 5, 6 తేదీలలో ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాల దరఖాస్తులు స్వీకరించేందుకు ఓటర్ల జాబితాలతో పోలింగ్ బూత్ స్థాయి అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.