Close

సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలకల్పనకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని వసతిగృహాల వార్డెన్లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.

Publish Date : 03/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 3 : సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలకల్పనకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని వసతిగృహాల వార్డెన్లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక అమీనాపేటలోని షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, సమీకృత వసతి గృహాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజన మెనూలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని, భోజన మెనూ నిర్దేశించిన విధంగా ఉండాలన్నారు. టాయిలెట్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, దోమలు పెరగకుండా చూడాలన్నారు. వసతి గృహాలకు దోమల నెట్లు అందించడం జరిగిందని, విద్యార్థులు జ్వరాల బారిన పడకుండా చూడాలన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు విద్యా ప్రమాణాల స్థాయిని పెంచేలా బోధనా చేయాలనీ, గత సంవత్సరం కన్నా ప్రస్తుత సంవత్సరం ఉతీర్ణతా శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు, రహదారి భద్రత నియమాలు, బాలికల భద్రత, తదితర అంశాలను కలెక్టర్ తెలియజేసారు. అత్యవసర సమయంలో 1972 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి రక్షణ పొందే అంశాలపై విద్యార్థినులకు అవగాహన కలిగించారు. కస్టపడి విద్య నభ్యసించి ఉన్నత స్థానం సాధించేలా కృషిచేయాలని విద్యార్థినులకు కలెక్టర్ చెప్పారు. అనంతరం కిచెన్ లో పరిశుభ్రతను,వన్డే ఆహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు.

కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జెడి వై.విశ్వమోహన్ రెడ్డి, ఏఎస్ డబ్ల్యూవో ఆర్.వి.శ్రీనివాసు, హాస్టల్ వెల్ఫేరు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.