Close

ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ఆమోదించిన జాబితాను పరిశీలించి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల లాగిన్ కి పంపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఏఈఆర్ఓ లను ఆదేశించారు.

Publish Date : 03/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 3 : ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ఆమోదించిన జాబితాను పరిశీలించి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల లాగిన్ కి పంపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఏఈఆర్ఓ లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 కార్యక్రమంలో ఎనామలీస్, సవరణలు, అభ్యంతరాలపై అందిన దరఖాస్తుల పరిష్కారం, తుది జాబితా తయారీపై ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ, తహశీల్దార్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించిన దృష్ట్యా నిర్దేశించిన గడువులోగా ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఓటర్ల తుది జాబితా తయారీ కి సంబంధించి ఆమోదించిన జాబితాను పరిశీలించి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల లాగిన్ కి పంపాలని ఆదేశించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 విధులలో నిర్లక్ష్యం వహించిన కుక్కునూరు, అగిరిపల్లి, కైకలూరు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని అధికారులను జేసీ ఆదేశించారు.
నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓ, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.